భారత యువ క్రికెటర్ రిషభ్ పంత్ అరుదైన ఘనత సాధించారు. ప్రతిష్టాత్మక లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్ 2025లో ‘కమ్ బ్యాక్ ఆఫ్ ది ఇయర్’ పురస్కారానికి పంత్ నామినేట్ అయ్యారు. భారత క్రికెటర్లలో పంత్ కంటే ముందు సచిన్ ఒక్కరే ఈ అవార్డుకు నామినేట్ అయ్యారు. ఏప్రిల్ 21న స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ నగరంలో ఈ అవార్డ్స్ ప్రదానోత్సవ కార్యక్రమం జరగనుంది. 2022లో పంత్‌కు యాక్సిడెంట్ కాగా అతడు కోలుకోవడానికి 14 నెలలు పట్టింది.