
అంబర్ పేట్: కాచిగూడ డివిజన్ పరిధిలో పర్యటించిన కార్పొరేటర్
కాచిగూడలోని మానియర్ పట్టి, సునార్ గల్లి, మోతి మార్కెట్, చప్పల్ బజార్ లో బుధవారం కార్పొరేటర్ కన్నె ఉమా రమేష్ యాదవ్ పర్యటించారు. స్థానికులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా మంచినీటి సరఫరా సమస్యలు ఉన్నాయని, తరచూ పొల్యూషన్ వాటర్ వచ్చి ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. వెంటనే సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కార్పొరేటర్ ఆదేశించారు. సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలన్నారు.