చేవెళ్ల లో వడగండ్ల వాన

84చూసినవారు
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం చేవెళ్ల మండల పరిధిలోగల పలు గ్రామాలలో అలాగే షాబాద్ మండల పరిధిలోగల పలు గ్రామాలలో సోమవారం మధ్యాహ్నము నుండి ఎడతెరిపు లేకుండా వడగండ్ల వాన కురుస్తున్నట్లు స్థానిక ప్రజలు తెలిపారు. అకాల భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అయినట్లు తెలిపారు. ఒక్కసారిగా వాతావరణం కూడా చల్లబడినట్లు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్