కొత్తూరు మండలంలోని ఇముల నర్వలోని జేపీ దర్గాలో నూతనంగా ఎన్నికైన జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొండకళ్ళ నాగేందర్ రెడ్డి బుధవారం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం నాగేందర్ రెడ్డిని యువజన కాంగ్రెస్ గిరిజన విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రేమ్ కుమార్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ యూత్ నాయకులు విగ్నేష్, చందు యాదవ్, నాగరాజ్ యాదవ్, శ్రీనాథ్ యాదవ్, అడ్డు, సద్దాం, తదితరులు పాల్గొన్నారు.