షాబాద్ మండలం ఎర్రోనిగూడ గ్రామంలో ప్రతిష్టించిన శ్రీ అభయ ఆంజనేయస్వామి దేవాలయ విగ్రహ ప్రతిష్టాపన ఏడవ వార్షికోత్సవ వేడుకులను వైభవంగా జరుపుకున్నారు. శనివారం శ్రీ అభయ ఆంజనేయస్వామి దేవాలయంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.