కాంగ్రెస్ ప్రభుత్వం పని తీరు నియంత పాలను తలపిస్తుందని, ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు అసెంబ్లీలో లేవనెత్తే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక సభ నుంచి ఎమ్మెల్యేలను బయటకు పంపేందుకు ప్రభుత్వం సిద్ధమైందని బీఆర్ఎస్ నాయకులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం షాద్ నగర్ పట్టణ కూడలిలో మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేసారు.