రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం నవాబ్ పేట్ మండల పరిధిలో గల చించల్ పేట్ గ్రామంలో మంగళవారం డప్పు చప్పుళ్ళతో, పోతురాజుల విన్యాసాలతో ఘనంగా ఊరడమ్మ జాతర కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి చేవెళ్ల శాసనసభ్యులు కాలె యాదయ్య ముఖ్యఅతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి జాతరను ప్రారంభించినట్లు ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.