హోమ్ ఓటింగ్ ప్రక్రియను చేపట్టాలి: జిల్లా కలెక్టర్

58చూసినవారు
హోమ్ ఓటింగ్ ప్రక్రియను చేపట్టాలి: జిల్లా కలెక్టర్
ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్, హోమ్ ఓటింగ్ ప్రక్రియను చేపట్టాలని జిల్లా కలెక్టర్ శశాంక సంబంధిత అధికారులకు సూచించారు. బుధవారం సమీకృత జిల్లా కార్యాలయంలో కలెక్టర్ శశాంక ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలతో పోస్టల్ బ్యాలెట్, హోమ్ ఓటింగ్ ప్రక్రియ సమావేశం నిర్వహించారు. పోలింగ్, ఇతర సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ అందజేయడం, పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ, నిబంధనలు, ఓటరు ఫెసిలిటేషన్ సెంటర్ల ఏర్పాటు పై దిశా, నిర్దేశం చేసారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్