నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగించే తిప్పాయిగూడ- ముకునూర్ రోడ్డును మరమ్మతు చేయించాలని సీపీఎం జిల్లా నాయకుడు గొరెంకల నర్సింహ డిమాండ్ చేశారు. శనివారం పార్టీ ఆధ్వర్యంలో రోడ్డును పరిశీలించారు. చారిత్రాత్మకమైన రాచకొండ గుట్టలకు ఆనుకొని ఉన్న తిప్పాయిగూడ రోడ్డు కంకర తేలి అధ్వానంగా మారిందన్నారు. దీంతో వాహనదారులు, ప్రయాణి కులు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. వెంటనే మరమ్మతు చేయించాలని కోరారు.