ఎల్బీ నగర్ ప్రజలు కామ దహన వేడుకలను గురువారం ఘనంగా జరుపుకున్నారు. హోలీ పండుగకు ముందు రోజు కాముడిని దహనం చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా కాలనిలో కాముని దహనాన్ని నిర్వహించారు. ముందుగా కాముడికి ప్రత్యేక పూజలు చేసి కామ దహనం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, కాలనీవాసులు పాల్గొన్నారు. కాముడి దహనం తర్వాతి రోజు ప్రజలు హోలీ పండుగను నిర్వహించుకోనున్నారు.