శాంతినగర్ కాలనీలో వైభవంగా ఎంగిలి పూల బతుకమ్మ

83చూసినవారు
శాంతినగర్ కాలనీలో వైభవంగా ఎంగిలి పూల బతుకమ్మ
పెద్దఅంబర్‏పేట్ 4వ వార్డు పరిధి శాంతినగర్ కాలనీలో ఎంగిలి పూల బతుకమ్మ పండుగను వైభవంగా జరుపుకున్నారు. మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి ప్రత్యేక పూజలు చేశారు. కాలనీలోని ప్రధాన చౌరస్తాలో  పెద్దసంఖ్యలో తరలివచ్చిన మహిళలు, యువతులు, చిన్నారులు బతుకమ్మ పాటలకు ఉత్సాహంగా ఆడిపాడారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో. బంగారు బతుకమ్మ ఉయ్యాలో. అంటూ బతుకమ్మల చుట్టూ తిరుగుతూ కోలాహలంగా పండుగను జరుపుకున్నారు.

సంబంధిత పోస్ట్