పెద్దఅంబర్‏పేట కౌన్సిలర్ విద్యావిజేందర్ రెడ్డి దాతృత్వం

77చూసినవారు
పెద్దఅంబర్‏పేట కౌన్సిలర్  విద్యావిజేందర్ రెడ్డి దాతృత్వం
పెద్దఅంబర్‏పేట కౌన్సిలర్ విద్యావిజేందర్ రెడ్డి దాతృత్వం చాటుకున్నారు. 4వ వార్డు శాంతినగర్ కాలనీలోని అంగన్వాడి కేంద్రంలో నీటి సరఫరాకు ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకుని స్పందించి తక్షణమే తన సొంత ఖర్చుతో నీటి మోటార్ కొనుగోలు చేసి సిబ్బందికి గురువారం అందజేశారు. విద్యావిజేందర్ రెడ్డి మాట్లాడుతూ ఇంకా వార్డు పరిధిలో ఎలాంటి సమస్యలున్నా తెలియజేయాలని అవసరమైతే తమ సొంత నిధులతో సమస్యలకు పరిష్కారం చూపుతామని తెలిపారు.

సంబంధిత పోస్ట్