అన్ని దానాలలో అతి గొప్ప దానం. అలాంటి అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని శనివారం చౌడమ్మ గుట్ట ఆంజనేయ స్వామి దేవాలయంలో ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డి ఏర్పాటు చేశారు. మొదటగా ఆంజనేయస్వామి దేవాలయంకు విచ్చేసిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం జరిగిన ఆంజనేయస్వామి పల్లకి సేవ కార్యక్రమంలో పాల్గొని పల్లకిని మోసి, తదనంతరము భజన భక్తులు ఆలకించిన భజన కీర్తనలకు అడుగులు వేసి ఆటలు ఆడారు.