సభ్యత్వం నమోదు చేసుకోండి: డీకే అరుణ

73చూసినవారు
సభ్యత్వం నమోదు చేసుకోండి: డీకే అరుణ
క్షేత్రస్థాయిలో బలపడితేనే పార్టీకి బలమని మహబూబ్ నగర్ జిల్లా ఎంపీ డీకే అరుణ అన్నారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సోమవారం వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలంలోని అన్నారం గ్రామంలో ప్రారంభించారు. గ్రామాల్లో కార్యకర్తలు ఎక్కువగా ఉన్నప్పుడే మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పార్టీకి పట్టు వస్తుందని ఆమె అన్నారు. అందుకోసం ప్రతి ఒక్కరు బీజేపీ సభ్యత్వాన్ని నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్