టీబీ నిర్మూలనకు కృషి చేయాలి

1363చూసినవారు
టీబీ నిర్మూలనకు కృషి చేయాలి
దేశంలో క్షయ (టీబి) నిర్మూలన ప్రజల అవగాహనతో సాధ్యమవుతుందని గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ (4 టైమ్స్), రచయిత, సోషల్ వర్కర్, ఆలిండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ & డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ డా, , పెండెం కృష్ణకుమార్ అన్నారు. దేశవ్యాప్తంగా టీబీ నియంత్రణ చేయడానికి మందులతో పాటు పౌష్టికాహారం చాలా ముఖ్యమైనది. కావున పేద క్షయ రోగిని దత్తత తీసుకొని వారికి ఆరు నెలల పాటు పౌష్టిక ఆహారం అందిస్తున్నానని ఈరోజు ప్రభుత్వ పట్టణ ఆరోగ్య కేంద్రం, మన్సూరాబాద్ నందు క్షయ రోగికి ఈనెల కొరకు పౌష్టిక ఆహారం సంబంధించిన గోధుమలు, కంది పప్పు, బియ్యం, రాగులు, నూనె, కోడిగుడ్లు మొదలగు సామగ్రి ని డా, , పెండెం కృష్ణ కుమార్ ఉచితంగా అందచేయడం జరిగింది. ఈ సందర్భంగా కృష్ణ కుమార్ మాట్లాడుతూ పేద క్షయ రోగులను దత్తత తీసుకోవాలని కోరారు. ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్ నిక్షయ మిత్ర కార్యక్రమంలో భాగస్వాములు కాగలరని దేశంలో క్షయ వ్యాధి నిర్మూలనకు అందరూ సహకరించాలని పేద క్షయరోగులను ఆదుకొని టీబి లేని దేశం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ టీబి అధికారులు, సిబ్బంది తిరుపతయ్య పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్