ఎల్బీనగర్ శివగంగా కాలనీలో ఘనంగా దేవి నవరాత్రి వేడుకలు జరిగాయి. దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అమ్మవారి నాల్గవ రోజు అన్నపూర్ణ దేవి రూపంలో అలంకరించారు. శివగంగా కాలనీలో జై భవాని వీర శివాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా మహా అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహించారు.