హైదరాబాద్‌: ఫీజు కట్టలేదని స్కూల్ యాజమాన్యం అరాచకం

65చూసినవారు
హైదరాబాద్‌లోని ఎల్‌బినగర్‌లోని పల్లవి అవేర్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. రూ.7000 ఫీజు కట్టలేదని యాజమాన్యం విద్యార్థులని బయట నిలబెట్టింది. విషయం తెలుసుకున్న లింగోజిగూడ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి స్కూల్‌కు వెళ్లి యాజమాన్యంతో మాట్లాడారు. విద్యార్థులను లోపలికి పంపించాలని కోరారు. దీంతో పాఠశాల సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు. దీంతో మాటామాటా పెరిగి వాగ్వాదం చోటు చేసుకుంది.

సంబంధిత పోస్ట్