పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ను శుక్రవారం జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు పాలకుర్ల రవికాంత్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలనలో భాగంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ప్రజలలో విస్తృత ప్రచారం నిర్వహించడంలో యువజన కాంగ్రెస్ కీలకపాత్ర పోషించి ముందుండాలని సూచించినట్లు చెప్పారు.