ఆమనగల్లు పట్టణంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని శనివారం తహసిల్దార్ లలితకు బీజేపీ నాయకులు విజ్ఞప్తి చేశారు. అనంతరం మాట్లాడుతూ నాలుగు మండలాల కూడలి అయిన ఆమనగల్లులో సబ్ రిజిస్టర్, రిజిస్ట్రేషన్, ఆర్టిఏ కార్యాలయాలతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేసి ప్రజల ఇబ్బందులను తొలగించాలని తహసిల్దార్ కు ఇచ్చిన వినతి పత్రంలో కోరారు.