ఆమనగల్లు మండలం మేడిగడ్డ తండాకు చెందిన అనితకు మంజూరైన 60,000 రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును మంగళవారం కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అనారోగ్యాల బారిన పడిన పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ముఖ్యమంత్రి సహాయ నిధిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్ రెడ్డి, యాటనరసింహ, భాస్కర్ రెడ్డి, జగన్, మెకానిక్ బాబా, విజయ రాథోడ్ పాల్గొన్నారు.