మహేశ్వరం నియోజకవర్గం జల్ పల్లి మున్సిపాలిటీలో 231 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే పి. సబితారెడ్డి మంగళవారం పంపిణీ చేయనున్నట్లు ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది తెలిపారు. పహాడీషరీఫ్ ప్రీమియర్ ఫంక్షన్ హాల్ లో ఉదయం 10. 30 గంటలకు జరిగే కార్యక్రమంలో లబ్ధిదారులు, కౌన్సిలర్లు పాల్గొనాలని సూచించారు.