కడ్తాల్ మండల కేంద్రం సమీపంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన రాజు, మహేష్ ల జ్ఞాపకార్థం శుక్రవారం కడ్తాల్ లో వారి మిత్రులు నిర్వహించిన రక్తదాన శిబిరం విజయవంతంగా ముగిసింది. శిబిరాన్ని మాజీ జెడ్పీటీసి దశరథ నాయక్ ప్రారంభించారు. యువకులు స్వచ్ఛందంగా వచ్చి తమ రక్తాన్ని దానం చేశారు. అనంతరం మాజీ జెడ్పీటీసి మాట్లాడుతూ ఆరోగ్యవంతులైన యువకులు రక్తదానం చేసి ప్రాణ దాతలుగా మిగలాలని కోరారు.