హరితహారం కార్యక్రమంలో నాటేందుకు వర్షాకాలం నాటికి మొక్కలు సిద్ధం చేయాలని ఎంపీడీవో సుజాత సూచించారు. గురువారం ఆమె కడ్తాల్ మండలం మక్తమాదారం గ్రామ నర్సరీని సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా మొక్కల పెంపకంలో తీసుకుంటున్న చర్యలను ఆమె నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ వేసవిలో ఎండ తీవ్రత నుండి మొక్కల ఎదుగుదలకు ఆటంకం కలుగకుండా తగు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.