రాష్ట్రంలో మాజీ సర్పంచులకు అండగా నిలిచి సోమవారం అసెంబ్లీలో పెండింగ్ బిల్లులపై గళమెత్తిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు, ప్రతిపక్ష శాసనసభ్యులకు రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షుడు, కడ్తాల్ మాజీ సర్పంచ్ లక్ష్మీ నర్సింహారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ తమ ఇబ్బందులను అసెంబ్లీ దృష్టికి తీసుకు వచ్చి కష్టాలను వివరించడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.