మాడుగుల మండలం దొడ్లపహాడ్ గ్రామానికి చెందిన యువకుడు ఏదుల వెంకటేష్ ఈనెల 15వ తేదీ నుండి కనిపించకుండా పోయినట్లు సీఐ జగదీష్ చెప్పారు. వెంకటేష్ టైల్స్ కూలీకి అప్పుడప్పుడు వెళ్తూ ఇంట్లో వృధాగా ఉంటుండడంతో పనికి వెళ్లకుంటే ఇల్లు గడవడం ఎలా అని తండ్రి మందలించినట్లు ఆయన తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులతో గొడవపడి ఇంటి నుండి వెళ్లిన ఆయన తిరిగి రాకపోవడంతో గురువారం తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన వివరించారు.