సబేస్టేషన్లో మరమ్మతుల కారణంగా మంగళవారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని సరూర్ నగర్ డివిజినల్ ఇంజినీర్ కే. రామకృష్ణ తెలిపారు. 11కేవీ లక్ష్మారెడ్డిపాలెం ఫీడర్ పరిధిలోని కాలనీలలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు. 11కేవీ మోహన్ నగర్, భవ్య హాస్పిటల్ ఫీడర్ల పరిధిలోని కాలనీలలో మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు. 11కేవీ పసుమాముల ఫీడర్ పరిధిలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తునాం అన్నారు.