చెట్లకొ మ్మల తొలగింపు, మరమ్మతుల కారణంగా శుక్రవారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నామని సరూర్ నగర్ డివిజినల్ ఇంజినీర్ కే. రామకృష్ణ తెలిపారు. 11కేవీ హరిపురి కాలనీ ఫీడర్ పరిధిలోని కాలనీల్లో ఉదయం 10. 30 నుంచి 11. 30 గంటల వరకు. 11కేవీ వాంబేకాలనీ, వీ-గార్డ్, రాక్ టౌన్, చాణక్యపురి, జీఎస్ఐ, హనుమాన్ నగర్ ఫీడర్ల పరిధిలోని ప్రాంతాల్లో ఉదయం 10. 30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ ఉండదన్నారు.