తలకొండపల్లి మండల కేంద్రంలో రేపు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ట్రాన్స్కో ఏఈ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. మండల కేంద్రంలోని సబ్ స్టేషన్ లో మరమ్మత్తుల కారణంగా ఉదయం 9 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు సరఫరాను నిలిపివేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. సరఫరా నిలిపి వేతకు విద్యుత్ వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.