పరిగి: సీఎం, ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు: విద్యార్థులు
ప్రభుత్వ హాస్టళ్ళు, అన్ని గురుకులాల్లో డైట్, కాస్మోటిక్ ఛార్జీలు 40% పెంచిన సందర్భంగా పరిగి మండలం సయ్యద్ మల్కాపూర్ మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల హాస్టల్ విద్యార్థులు సీఎం రేవంత్ రెడ్డికి, డీసీసీ అధ్యక్షులు, పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం విద్యార్థులతో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కేక్ కట్ చేసి విద్యార్థులకు కావలసిన స్టేషనరీ, వస్తువులను అందించారు.