పరిగి: లగచర్ల దాడి.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయాలని ప్లాన్
కలెక్టర్ ను కుట్ర పూరితంగా చంపాలని ప్రయత్నం చేశారని, లగచర్ల లో శేఖర్ ను బంధించి దాడి చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయాలని ప్లాన్ చేశారని డీసీసీ అధ్యక్షులు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు. బుధవారం కొడంగల్ నియోజకవర్గంలో రైతుల సమస్యలు తెలుసుకోవడానికి MP మల్లు రవి, అగ్రికల్చర్ కమిషన్ ఛైర్మన్ కోదండ రామిరెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మెన్ బెల్లయ నాయక్, కాంగ్రెస్ నేతలు వచ్చారు.