రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో మైలర్ దేవ్ పల్లి డివిజన్‌లో ఉన్న వెంకన్న గుట్ట శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో నూతన సంవత్సరం సందర్భంగా బుధవారం ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంలో స్వామివారికి పుష్పార్చన, అభిషేకం నిర్వహించడంతో పాటు మహిళలు పారాయణం చేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుని పుణ్యం అందుకున్నారు. దేవస్థాన పరిసర ప్రాంతం భక్తులతో కిటకిటలాడింది.