ఆర్థిక ఇబ్బందులతో యువకుడు ఆత్మహత్య

60చూసినవారు
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం గండిపేట లో గురువారం విషాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. మల్లికార్జున్ అనే యువకుడు తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకున్నట్లు తెలిపారు. మల్లికార్జున్ అర్ద నాదాలు విని స్థానికులు మంటలు ఆర్పి హుటా హుటిన వైద్యంనిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. జరిగిన ఘటనపై నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్