
రాజేంద్రనగర్: మరమ్మతు పనుల కారణంగా విద్యుత్ కు అంతరాయం
విద్యుత్ సంబంధ మరమ్మతు పనుల కారణంగా శనివారం మైలార్ దేవ్ పల్లి విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. మైలార్ దేవ్ పల్లి, బృందావన్ కాలనీ ఫీడర్లలో ఉదయం 11 నుంచి 11. 30 గంటల వరకు టాటానగర్, బృందావన్ కాలనీ, ప్రగతి కాలనీ, మొగల్స్ కాలనీ, మైలార్ దేవ్ పల్లి గ్రామం, రామకృష్ణాహిల్స్, వినాయక్ నగర్ ప్రాంతాల్లో విద్యుత్ ఉండదన్నారు.