సంధ్య థియేటర్ ఘటన అటు సినీపరిశ్రమలో తీవ్ర కలకలం రేపింది. గురువారం సినీ ప్రముఖులతో కొనసాగుతున్న సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన ప్రకటన చేశారు. సినిమాల బెనిఫిట్ షోలకు, టికెట్లరేట్ల పెంపుకు ఇకపై అనుమతించబోమని స్పష్టం చేశారు. ఈ అంశంపై అసెంబ్లీలో తాను, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన ప్రకటనలకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. అనుమతులు, తగిన బందోబస్తు ఉంటేనే ఈవెంట్లకు అనుమతి ఇస్తామని చెప్పారు.