మనిషికి దేవుడు ప్రాణం పోస్తే దానిని ఆపద సమయాల్లో నిలబెట్టేవాడు వైద్యుడు అని అందుకే పవిత్రమైన వైద్య వృత్తిలో నిష్పక్షపాతంగా సిబ్బంది పనిచేసి ప్రభుత్వానికి సమాజానికి మంచి పేరు తీసుకురావాలని షాద్ నగర్ ఎమ్మెల్యే శంకర్ సూచించారు. శుక్రవారం షాద్ నగర్ పట్టణంలోని ఎంపీడీవో సమావేశ మందిరంలో షాద్ నగర్ డివిజన్ వైద్య ఆరోగ్యశాఖ సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథిగా స్ధానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హాజరయ్యారు.