సమాజంలో ఆర్యవైశ్యులది కీలక పాత్ర అని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. సోమవారం రాత్రి శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవాలయంలో జరిగిన పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు మలిపెద్ది శ్రీనివాస్ గుప్తా ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రమాణ స్వీకారం చేసిన మలిపెద్ది శ్రీనివాస్ గుప్తను ఎమ్మెల్యే అభినందిస్తూ సన్మానించారు.