రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం బైపాస్ దగ్గరలో గల చాక్లెట్ కంపెనీ సమీపంలో మంగళవారం దారుణం చోటు చేసుకుంది. స్థానికులు తెలియజేసిన వివరాల ప్రకారం అప్పుడే పుట్టిన బాబును గుర్తుతెలియని వ్యక్తులు వదిలేసి వెళ్లినట్లు తెలిపారు. గమనించిన స్థానికులు వెంటనే స్థానిక పోలీస్ సిబ్బందికి సమాచారం అందజేసినట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.