గడీలపై గళమెత్తి భూపోరాటానికి నాంది పలికిన వీరనారి చాకలి ఐలమ్మ అని రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్, షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. అసెంబ్లీ, గాంధీ భవన్, శాసన మండలి, శంషాబాద్ లలో వేరువేరుగా గురువారం జరిగిన కార్యక్రమాలలో ఘనంగా ఐలమ్మ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. గడీలపై గళమెత్తి భూపోరాటానికి నాంది పలికిన ఐలమ్మ మహిళ చైతన్యానికి ప్రతీక అని కొనియాడారు.