షాద్ నగర్ మున్సిపాలిటి పరిధిలో గురువారం నిర్వహించిన 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు స్థానిక ట్రాఫిక్ సీఐ చంద్రశేఖర్ హాజరై మహానీయుల చిత్రపటాలకు నివాళులు అర్పించారు. అనంతరం ట్రాఫిక్ సీఐ చంద్రశేఖర్ చేతుల మీదగా జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. పంద్రాగస్టు వేడుకలను పురస్కరించుకొని లయన్స్ క్లబ్ ఆప్ షాద్ నగర్ స్టార్స్ ఆధ్వరంలో మున్సిపల్ సిబ్బందికి బట్టలు పంపిణి చేశారు.