స్వాతంత్య్ర సమరయోధుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. గురువారం షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని 20వ వార్డు పటేల్ రోడ్డులో కాంగ్రెస్ యువ నాయకులు మన్నే రవి, నీరటి వాసుల ఆధ్వర్యంలో నిర్వహించిన 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి హాజరై మహనీయుల చిత్రపటాల వద్ద పువ్వులు చల్లి నివాళులు అర్పించారు.