కలియుగంలో పిలిస్తే పలికే దైవంగా, భక్తుల పాలిట కొంగు బంగారంగా ఆ శ్రీమన్నారయణుడ్ని భావిస్తారని వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆయనను దర్శించుకున్న ప్రతి భక్తుడికి ప్రతి పనిలో విజయం వరించాలని షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి అన్నారు. శుక్రవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా జానంపేట శ్రీవెంకటేశ్వర స్వామి దేవాలయంలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి ఉత్తర ద్వారా దర్శనంతో పాటు స్వామివారిని దర్శించుకున్నారు.