నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పనే ధ్యేయంగా ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ సంస్థలు నైపుణ్యతను ఇస్తే మంచి అవకాశాలు యువతకు లభిస్తాయి అని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ స్పష్టం చేశారు. శనివారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణ మున్సిపాలిటీ సమావేశ మందిరంలో మైక్రోసాఫ్ట్, యునైటెడ్ వే ఆప్ హైదరాబాద్ వారి సౌజన్యంతో స్నిఫీ ఆధ్వర్యంలో స్కీల్ డెవలప్మెంట్ 2వ బ్యాచ్ శిక్షణ ప్రారంభోత్సవాన్ని ప్రారంభించారు.