రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం బుధవారం అట్టహాసంగా జరిగింది. స్థానిక ఓ గార్డెన్ లో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి, రాజేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్ రెడ్డి సమక్షంలో చైర్ పర్సన్ గా యాట గీత నర్సింహా, వైస్ ఛైర్మన్ గా భాస్కర్ రెడ్డి తో పాటు 16 మంది డైరెక్టర్లతో మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం చేయించారు.