డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను తక్షణమే బర్తరఫ్ చేయాలని రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ చల్లా నరసింహారెడ్డి నేతృత్వంలో అమిత్ షా వ్యాఖ్యలను నిరసిస్తూ నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.