షాద్‌నగర్ నియోజకవర్గంలోని చటాన్ పల్లిలోని హనుమాన్ దేవాలయంతో పాటు పోచమ్మ ఆలయంలో సీసీ కెమెరాలను మున్సిపల్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ చేగురి రాజేందర్ రెడ్డి ఏర్పాటు చేయించారు. ఈ సందర్భంగా షాద్ నగర్ పట్టణ సీఐ విజయ్ కుమార్ రాజేందర్ రెడ్డిని అభినందిస్తూ శాలువాతో శుక్రవారం సన్మానించారు. ఈ కార్యక్రమంలో షాద్ నగర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెన్నయ్య, అర్జున్ లక్ష్మణ్, శేఖర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.