హైదరాబాద్ లో దారుణం.. భార్యను హత్య చేసి తగలబెట్టిన భర్త
భార్యాభర్తల మధ్య తలెత్తిన గొడవ దారుణ హత్యకు దారితీసింది. హైదరాబాద్ బండ్లగూడకు చెందిన ఫైజ్ ఖురేషికి తన భార్య ఖమర్ బేగంకు సోమవారం అర్థరాత్రి గొడవ జరిగింది. సహనం కోల్పొయిన ఖురేషి కత్తితో భార్య గొంతుకోసి చంపాడు. అనంతరం ఆమె శవాన్ని తగలబెట్టి అగ్నిప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. చుట్టుపక్కల వాళ్ళు రావడంతో భయపడిన ఖురేషి నేరుగా వెళ్లి పోలీసులకు లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.