సమగ్ర ఇంటింటి సర్వేలో ఉప్పల్ ఎమ్మెల్యే
సైనిక్ పూరిలోని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి నివాసంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, ఉపాధి, కుల సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో మంగళవారం ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పాలోన్నారు. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే అనంతరం ఎన్యూమరేటర్లకు కుటుంబ వివరాలు అందించారు. ఈ కార్యక్రమంలో కాప్రా సర్కిల్ డీసి జగన్, ట్యాక్స్ ఇన్స్పెక్టర్ విజయరాజ్, తదితరులు పాల్గొన్నారు.