నాచారం లో వీధి కుక్కలు స్వైర విహారం...

52చూసినవారు
వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా రోడ్లపై దొరికిన వారిని దొరికినట్లు కరుస్తూ బీభత్సం సృష్టిస్తున్నాయి. గుంపులు గుంపులుగా వీధుల్లో సంచరిస్తూ చిన్నారులపై దాడికి దిగుతున్నాయి. నాచారం రాఘవేంద్ర నగర్ లో చిన్నారులు వీధిలో ఆడుకుంటుండగా వీధి కుక్క వెంటపడి చిన్నారులను గాయపరిచింది. చిన్నారులను స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన తో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్