నీట్ పరీక్షల్లో జరిగిన అవినీతిపై ప్రధాని నరేంద్ర మోదీతో చర్చలు జరపడమే ఇండియా కూటమి లక్ష్యమని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఏడేళ్లలో 70 సార్లు పరీక్ష పత్రాలు లీక్ అయ్యాయని, రెండు కోట్ల మంది విద్యార్థులు సమస్యలు ఎదుర్కొన్నారని ఆరోపించారు. పరిష్కారం చూపాలని దేశవ్యాప్తంగా విద్యార్థులు ప్రధానిని విద్యార్థులు కోరుతున్నా ఆయన మౌనం వహించారని విమర్శించారు.