అసెంబ్లీలో ఎవరు ఎన్ని అప్పులు చేశారో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రైతులకు రూ.21 వేల కోట్ల రుణమాఫీని ఏడాదిలోపే జమ చేశామని చెప్పారు. ఇప్పటి వరకు ఉన్న లెక్కల ప్రకారం రూ.66,722 కోట్లు అప్పులు కడుతున్నామని తెలిపారు. సంక్రాంతి తరువాతే రైతు భరోసా వేస్తామని సీఎం రేవంత్ ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. అన్నదాతలను ప్రొత్సహించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు.